Reading Time: < 1 minute

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘ధురంధర్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే జోరుతో ఆ సినిమా సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ చిక్కుల్లో పడ్డారు.

సంతోష్ కుమార్ అనే దర్శకుడు.. అదిత్య తన కథను కాపీ కొట్టి సినిమా తీశారంటూ ఆరోపణలు చేశాడు. ‘స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’లో తన కథ రిజిస్టర్ అయి ఉందని అదిత్య పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిచాడు.

దీంతో ఆదిత్య తనపై సంతోష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని.. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నాడని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై తాజాగా హై కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ చేపట్టే వరకూ ఆదిత్య గురించి ఏం మాట్లాడకూడదంటూ సంతోష్‌కు న్యాయస్థానం సూచించింది. ఇలాంటి పునరావృతం కాకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీన జరుగనుంది.