
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకు ముందు విడుదలైన సాంగ్స్, టీజర్‌కి కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయా.. అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫ్యాన్స్‌లో మరింత జోష్‌ని నింపుతోంది. ఎఆర్ రెహమాన్ సంగీతం తమకూరుస్తున్నా ఈ సినిమాలో ఉండే ఐటమ్ సాంగ్ కోసం ఓ యంగ్ బ్యూటీకి ఛాన్స్ ఇస్తున్నారని పుకార్లు చెక్కర్లు కొడుతున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఇటీవలే ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ప్రేక్షకుల మనస్సు దోచేసిన మానస వారణాసి. తొలుత ఈ పాట కోసం మృణాల్ ఠాకూర్‌ని అనుకున్నారట. అయితే మృణాల్ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మానసకు ఈ ఛాన్స్ దక్కిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గల్లా జయదేవ్ హీరోగా చేసిన ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలో మానస హీరోయిన్‌గా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుటివరకూ అధికారిక ప్రకటన లేదు. ఇక జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.