Reading Time: < 1 minute

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అవుట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య ఇంట్లో ఎసిబి సోదాలు చేపట్టింది. బుధవారం ఆయన నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించి.. దాదాపు రూ.35 లక్షల నగదు, పలు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కనకయ్య, సబ్‌ఇన్‌స్పెక్టర్ సిద్ధేశ్వర్‌లను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఇద్దరు పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో భాగంగానే ఇవాళ ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య ఇంట్లో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు.