Reading Time: < 1 minute

గౌహతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా 13వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడబోతున్నాయి. మరికాసేపట్లో గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు ప్రారంభం కానుంది. అయితే, వర్షం పడటంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. స్టేడియం పరిసరాల్లో వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది. ప్రస్తుతం వర్షం నిలిచిపోయినా మైదానం తడిగా ఉంది. దీంతో గ్రౌండ్ సిబ్బంది స్టేడియాన్ని రెడీ చేసే పనిలో ఉన్నారు.