Reading Time: < 1 minute

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. మంగళవారం గడువులోగా ఒక ఒప్పందానికి రావాలని.. అలా చేయకపోతే.. ఇరాన్‌ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుందని ట్రంప్ హెచ్చరించారు.

ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. దాన్ని మళ్లీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేము. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అదే జరుగుతుంది. ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఈ రాత్రి అత్యంత కీలకం. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి అంతమవుతాయి అంటూ తన ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్, ఇరాన్ ను తీవ్రంగా హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలు.. ఇప్పుడు పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతను మరింత పెంచాయి.