
హైదరాబాద్: ఎంఎస్ ధోనీ మైదానంలో ఉంటే సిఎస్‌కె కెప్టెన్‌కు సలహాలు ఇస్తాడని టీమిండియా మాజీ ఆటగాడు అశ్విన్ తెలిపాడు. సిఎస్‌కె బౌలింగ్ దళానికి సహాయ సహకారాలు అందించడంతో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు దిక్సూచిలా ఉంటారని తెలియజేశారు. గతం సీజన్‌లో చివరి మూడు ఓవర్లలో మాత్రమే ధోనీ బ్యాటింగ్ చేసేవాడని, ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదని టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉండడంతో చివరలోనే బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉందన్నారు. కీపింగ్ పై ధోనీ ప్రధానంగా దృష్టి పెట్టడంతో పాటు ఫీల్డ్ సెట్టింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ మార్గనిర్దేశనం చేస్తాడని అశ్విన్ పేర్కొన్నాడు. ధోని పెద్దన్న పాత్రలో ఉంచాలని, ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగించ వద్దని కోరాడు. సిఎస్‌కె ఎలెవన్‌లో అతడు కచ్చితంగా ఉండాలని, లేకపోతే రిటైర్‌మెంట్ ఇచ్చి సాగనంపాలన్నారు. ధోనీ మూడు నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడని, ఆయనకు ఆడగలను అనే నమ్మకం ఉందని అశ్విన్ పేర్కొన్నాడు. ఒక వేళ ధోనీ ఆడాలనుకుంటే అతడిని ఆడటం కుదరదని చెప్పడం సాధ్యం కాదన్నారు.