
లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను నిర్దోషిగా విడుదల చేయడంపై భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ విమర్శలు గుప్పించారు. మహిళా రెజ్లర్లు వెనుకాడబోరని, ఢిల్లీ కోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తామని ఆమె అన్నారు.
కోర్టు తీర్పుపై ప్రముఖ తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన రెజ్లర్ వినేశ్ ఫోగట్.. న్యాయస్థానం తీర్పు ఎలా ఉన్నప్పటికీ తమ పోరాటం మాత్రం ముగిసిపోలేదని స్పష్టం చేశారు. మొదటి నుంచి వ్యవస్థలు బ్రిజ్ భూషణ్‌ను కాపాడే ప్రయత్నం చేశాయని ఆరోపించిన ఆమె.. ఈ తీర్పుపై ఉన్నత కోర్టులో అప్పీల్ చేయడానికి తమ లాయర్లకు సూచించినట్లు వెల్లడించారు. తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆశ కోల్పోలేదని, న్యాయం కోసం తమ పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.
బ్రిజ్ భూషణ్ కు ఊరట
మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారణ జరిపిన అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అశ్విని పన్వార్.. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న బ్రిజ్ భూషణ్ , WFI మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం తీర్పునిచ్చారు. నేరం నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది.
తీర్పు అనంతరం మాట్లాడిన బ్రిజ్ భూషణ్.. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపణ కాదని కోర్టు గౌరవప్రదంగా నిర్దోషిగా తేల్చిందని, ఇది తనకు, తన మద్దతుదారులకు ఎంతో సంతోషకరమైన రోజని అన్నారు.
►ALSO READ | కర్నాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. DK శివకుమార్ మంత్రివర్గంలోకి కొత్తగా 20 మంది