
మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న మూవీ ‘ఇరుముడి’(Irumudi). ఆగస్ట్ 21న మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా నుంచి రెండో పాట ‘యాలాలో యాలాలో’ (Yaalalo Yaalalo) రిలీజ్ చేశారు. ఇటీవలే ఇరుముడు కట్టు అనే ఫస్ట్ సింగిల్ తో మాస్ వైబ్స్‌ను అందించిన మేకర్స్.. ఈసారి హార్ట్ టచ్చింగ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన మెలోడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ పాటలో రవితేజ తన భార్య, బిడ్డతో గడిపే అందమైన క్షణాలను, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించారు. కుటుంబ బంధాలు, ప్రేమ, ఆప్యాయతలను ప్రతిబింబించేలా తెరకెక్కించిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటకు టాలీవుడ్ టాప్ లిరిసిస్ట్ అనంత శ్రీరాం బ్యూటిఫుల్ సాహిత్యం అందించారు. హేశం అబ్దుల్ వహాబ్ మరియు సాధిక తమ మధురమైన గొంతుతో పాటకు ప్రాణం పోశారు.
►ALSO READ | OTT Movie Review: ఓటీటీలో హార్ట్ టచ్చింగ్ మూవీ.. ‘చిన్న చిన్న ఆశై’ ఎలా ఉందంటే?
డైరెక్టర్ శివ నిర్వాణ.. ఈ చిత్రంలో అందమైన, ఇంటెన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఆవిష్కరించబోతున్నారనే సంకేతాలను ఈ పాట చూపించింది. ఇకపోతే, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘కట్టు కట్టు ఇరుముడి కట్టు’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోగా, తాజాగా విడుదలైన ‘యాలాలో యాలాలో’ కూడా అదే స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది.