
వేములవాడ: శ్రీ రామనవమి సందర్భంగా వేములవాడలోని భీమేశ్వరాలయంలో స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలకు పొన్నం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భీమేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. యావత్ దేశ వ్యాప్తంగా రాములోరి పెళ్లి అంటే లోక కల్యాణం కోసం సర్వేజనా సుఖినోభవంతు అని వేడుకగా జరిగే కళ్యాణ ఉత్సవాలు అని కొనియాడారు. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు. పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఉన్నారు.