Reading Time: 2 minutes
Vivo S2 Launch On August 6 7050mah Battery 6 83 Inch Curved Amoled Display 50mp Sony Camera

vivo S2: ఆగస్టు 6న వివో (VIVIO) నుండి కొత్త vivo S2 స్మార్ట్‌ఫోన్‌ అధికారికంగా లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్లను వెల్లడించింది. స్లిమ్ డిజైన్, భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, AI ఫీచర్లతో ఈ ఫోన్ మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో వినియోగదారుల ముందుకు వచ్చేస్తుంది.

కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే:

వివో S2లో 6.83 అంగుళాల 3D Curved AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1.5K రిజల్యూషన్ తోపాటు 120Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. ఎడ్జ్-టు-ఎడ్జ్ వ్యూయింగ్ అనుభవాన్ని అందించే ఈ డిస్‌ప్లే వినోదం, గేమింగ్‌కు మరింత మెరుగైన అనుభూతిని ఇస్తుంది. కేవలం 7.99mm మందంతో రూపొందించిన ఈ ఫోన్ ప్రీమియం మెటాలిక్ ఫినిష్‌తో వస్తుంది. ఇది సిల్క్ వైట్, సఫైర్ బ్లూ, రీగల్ బ్రాంజ్ రంగుల్లో రానుంది.

సోనీ కెమెరా:

ఫోటోగ్రఫీ కోసం ఇందులో Sony IMX852 సెన్సార్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ముఖ్యంగా ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అలాగే ఆరా లైట్ పోర్ట్రెయిట్, డ్యూయల్ వ్యూ వీడియో వంటి ఫీచర్లు కంటెంట్ క్రియేటర్లకు మరింత ఉపయోగపడతాయి.

టర్బో ప్రాసెసర్:

ఈ ఫోన్‌కు MediaTek Dimensity 7360-Turbo చిప్‌సెట్ శక్తినిస్తోంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాసెసర్ AnTuTu బెంచ్‌మార్క్‌లో 9.7 లక్షల స్కోర్ సాధించింది. దీంతో గేమింగ్, మల్టీటాస్కింగ్, రోజువారీ వినియోగంలో మెరుగైన పనితీరు లభించనుంది.

భారీ బ్యాటరీ & AI ఫీచర్లు:

vivo S2లో 7050mAh భారీ బ్యాటరీను అందించారు. వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, నావిగేషన్, వీడియో షూటింగ్ వంటి పనులను రోజంతా సులభంగా నిర్వహించేలా ఈ బ్యాటరీ సామర్థ్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ OriginOS 6పై పనిచేస్తుంది. ఇందులో పలు AI ఆధారిత ఫీచర్లను అందించారు. ఇందులో..

Shake and Share – డేటా, 4K వీడియోలను హై-స్పీడ్‌తో సులభంగా షేర్ చేసే ఫీచర్.
Circle to Search 2.0 – స్క్రీన్‌పై ఉన్న టెక్స్ట్ లేదా ఇమేజ్‌ను వెంటనే సెర్చ్ చేసే AI ఫీచర్.
vivo Office Kit – డాక్యుమెంట్లను సులభంగా వీక్షించడం, ఎడిట్ చేయడం కోసం రూపొందించిన టూల్.
AI Creation – AI సహాయంతో క్రియేటివ్ కంటెంట్‌ను వేగంగా రూపొందించే ఫీచర్.
AI Transcript Assist – ఆడియో లేదా మీటింగ్‌లను టెక్స్ట్‌గా ఆటోమేటిక్‌గా మార్చే AI ఫీచర్.
వంటి స్మార్ట్ టూల్స్ ఉన్నాయి. vivo S2 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 6న అధికారికంగా లాంచ్ కానుంది. అదే రోజు ఈ ఫోన్ ధర, స్టోరేజ్ వేరియంట్లు, విక్రయాల వివరాలు వెల్లడించనుంది. భారీ బ్యాటరీ, కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, AI ఫీచర్లతో vivo S2 మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు.