
బెంగళూర్: కర్నాటక కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. సుదీర్ఘ చర్చల అనంతరం మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 20 మంది పేర్లను అధిష్టానం ఫైనల్ చేయగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సోమవారం (ఆగస్ట్ 3) తుది జాబితాకు ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు 20 మంది పేర్లతో కూడిన జాబితాను అధిష్టానం విడుదల చేసింది.
దీంతో డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రి వర్గంలోకి కొత్తగా 20 మంది చేరనున్నారు. వీరంతా 2026, ఆగస్ట్ 3న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని సీఎం డీకే శివకుమార్ లోక్ భవన్ ను కోరినట్లు సమాచారం.
కాగా, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని హైకమాండ్ మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. యువత, మైనారిటీలకు కేబినెట్లో పెద్దపీట వేసింది. కాగా, 2026, జూన్ 4న డీకే శివకుమార్ కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన పాటు మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక మంత్రివర్గం పూర్తి స్థాయి సామర్థ్యం 34 మంది.
►ALSO READ | బీహార్ ఉప ఎన్నిక : ఆరు రౌండ్ల తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం : బీజేపీకి తేడా కొడుతుందా..?
తాజా విస్తరణతో కేబినెట్లో ఖాళీగా ఉన్న 20 స్థానాలు భర్తీ అయ్యాయి. దీంతో కర్ణాటక మంత్రివర్గం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది. రోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీఎస్ పాటిల్ కర్ణాటక అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా, ఎ.ఎస్. పొన్నన్న డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. శాసన మండలి చైర్మన్గా సలీం అహ్మద్, మండలి డిప్యూటీ చైర్మన్గా ఉమాశ్రీ నామినేట్ అయ్యారు.
కేబినెట్లో చేరనున్న 20 మంది మంత్రుల జాబితా:
1. పి.ఎం. నరేంద్రస్వామి
2. శివరాజ్ తంగడగి
3. రుద్రప్ప లమాని
4. కె.ఎస్. బసవంతప్ప
5. బి. నాగేంద్ర
6. టి. రఘుమూర్తి
7. బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్
8. రిజ్వాన్ అర్షద్
9. సంతోష్ లాడ్
10. బంగారప్ప
11. పుట్టరంగశెట్టి
12. మంకాల వైద్య
13. ఎన్. చలువరాయ స్వామి
14.కె.ఎం. శివలింగే గౌడ
15. హెచ్.సి. బాలకృష్ణ
16. గాయత్రి శాంతే గౌడ
17. అజయ్ సింగ్
18. బసవరాజ్ రాయరెడ్డి
19. విజయానంద్ కాశప్పనవర్
20. లక్ష్మణ్ సవది