సిరిసిల్ల నేతన్న మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. కేవలం మూడున్నర గంటల్లోనే చీరను తయారుచేసి రికార్డ్ సృష్టించాడు . పూర్తిగా మగ్గం పైనే ఈ చీరను నేసి.. ఆశ్చర్య పరిచాడు. ఐదున్నర మీటర్ల పొడవుతో తయారు చేశాడు. తయారు చేసిన చీరను అగ్గి పెట్ట లో..పెట్టి.. తన కళా నైపుణ్యాన్ని చాటి చెప్పాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. సాంప్రదాయ చేనేత మగ్గంపై కేవలం (2 గంటల 50 నిమిషాల్లో) 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు గల పూర్తి చేనేత చీరను నేశారు. అనంతరం అదే చీరను ప్రత్యేకమైన నైపుణ్యంతో, 12 సెం.మీ. పొడవు, 6.5 సెం.మీ. వెడల్పు, 2.5 సెం.మీ. ఎత్తు గల అగ్గిపెట్టెలో ఇమిడే విధంగా ప్రదర్శించారు. ఇంత పెద్ద చీరను అవలీలగా అగ్గిపెట్టెలో పెట్టాడు. పూర్తిగా మగ్గం ద్వారానే చీరను తయారు చేశాడు.
ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా.. ఈ చీరను రూపొందించారు. సహజంగా.. ఒక చీరను తయారు చేయాలంటే, మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది. కానీ. ఈయన మాత్రం మూడున్నర గంటల్లోనే చీరను తయారు చేశాడు. ఇలాంటి రికార్డు ఎవరు చేయలేదు. హరి ప్రసాద్.. ఈ రికార్డు కోసం సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేశారు.
దీంతో ఎలాంటి అలసట లేకుండా, పూర్తిగా ఏకాగ్రతతో ఈ చీరను తయారు చేశారు. చీర తయారు చేస్తున్న సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి తిలకించారు. చీర తయారీ తర్వాత అతన్ని అభినందించారు. ఆగస్టు 7న చేనేత దినోత్సవ సందర్బంగా.. రికార్డు నెలకొల్పారు. తోటి నేత కార్మికులు అభినందించారు.
భారతీయ చేనేత సంప్రదాయానికి, తెలంగాణ చేనేత కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుందని హరి ప్రసాద్ చెబుతున్నారు . చేనేత రంగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడం, యువతలో చేనేతపై ఆసక్తి పెంపొందించడం కోసం ఈ రికార్డు నెలకొల్పినట్లు తెలుపుతున్నారు. సిరిసిల్ల నేతన్నల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.




