
ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflixతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫ్లిప్‌కార్ట్.. తన Plus మెంబర్లకు ప్రతి నెల ఉచిత Netflix Mobile సబ్‌స్క్రిప్షన్ అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు తప్పనిసరిగా పాటించాలి.
ముందుగా మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ అయి ఉండాలి. ఆ తర్వాత ఒకే క్యాలెండర్ నెలలో కనీసం 4 విజయవంతమైన ఆర్డర్లు పూర్తి చేయాలి. ప్రతి ఆర్డర్ విలువ కనీసం రూ.299 ఉండాలి. ఈ ఆర్డర్లు ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ ద్వారా చేసినవైనా సరిపోతాయి. అయితే రద్దు చేసిన లేదా రిటర్న్ ఇచ్చిన ఆర్డర్లు మాత్రం ఈ ఆఫర్ కింద లెక్కలోకి రావు. 4వ ఆర్డర్ ఆ నెలకు సంబంధించిన Netflix Mobile ప్లాన్‌ను ఉచితంగా క్లెయిమ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ కండిషన్స్ నెరవేర్చితే, ప్రతి నెలా ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
క్లెయిమ్ చేయడం తప్పనిసరి
అర్హత సాధించినంత మాత్రాన Netflix ఆటోమేటిక్‌గా యాక్టివేట్ కాదు. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో My Account > Plus విభాగానికి వెళ్లి Claim లేదా Activate బటన్‌ను ఎంచుకోవాలి. దీంతో ఇప్పటికే ఉన్న Netflix అకౌంట్‌ను లింక్ చేయవచ్చు లేదా కొత్త అకౌంట్‌ను మొబైల్ నంబర్, ఈమెయిల్‌తో ఓటీటీ ఖాతాను సృష్టించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్‌ను దశలవారీగా అందిస్తున్నారు. అందువల్ల అన్ని Plus సభ్యులకు ఒకేసారి కనిపించకపోవచ్చు. కొంతమందికి వెయిట్‌లిస్ట్‌లో చేరే అవకాశం కూడా ఉండొచ్చు.
►ALSO READ | 70:15:15 ఇన్వెస్ట్‌మెంట్ ఫార్ములా.. తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడుల సీక్రెట్ ఇదే!
Netflix Mobile ప్లాన్‌లో ఏమి లభిస్తుంది?
ఈ ప్లాన్ ద్వారా Netflixలో అందుబాటులో ఉన్న భారతీయ కంటెంట్ మొత్తం వీక్షించవచ్చు. అయితే ఇది ఒకేసారి ఒక మొబైల్ లేదా ట్యాబ్లెట్‌లో మాత్రమే పనిచేస్తుంది. వీడియోలు స్టాండర్డ్ డెఫినిషన్ క్వాలిటీతో మాత్రమే స్ట్రీమ్ అవుతాయి. అయితే ఈ ప్లాన్‌ను టీవీ, ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో ఉపయోగించలేరు. అలాగే HD లేదా Ultra HD స్ట్రీమింగ్ సపోర్ట్ ఉండదు. ఒకేసారి ఒక డివైజ్ లో మాత్రమే లాగిన్ అయ్యేందుకు వీలు కల్పించబడింది.
ఎవరికి ఎక్కువ ప్రయోజనం?
ప్రతి నెలా ఫ్లిప్‌కార్ట్‌లో తరచూ షాపింగ్ చేసే Plus మెంబర్లకు ఈ ఆఫర్ మంచి అదనపు ప్రయోజనం కానుంది. ఇప్పటికే చేసే కొనుగోళ్లతోనే అదనంగా Netflix Mobile సబ్‌స్క్రిప్షన్ లభిస్తుండటంతో, వినోదం కోసం ప్రత్యేకంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది.