Reading Time: 2 minutes

ఐపీఎల్ 2027 ముందు ఢిల్లీ మాస్టర్ ప్లాన్.. సీఎస్కే రిజెక్ట్‌ ప్లేయర్లకు గోల్డెన్ ఛాన్స్!

Caption of Image.

Delhi Capitals: ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఫ్రాంచైజీలు అప్పుడే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో నిరాశజనక ప్రదర్శనతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాబోయే సీజన్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తమ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్‌ను ట్రేడ్ చేసుకున్న ఢిల్లీ, తాజాగా రాబోయే వేలానికి ముందే కొత్త టాలెంట్ ని దక్కించుకోవడానికి బెంగళూరు వేదికగా ట్రయల్స్ స్టార్ట్ చేసింది. 

పంత్ కోసం కుల్దీప్‌ను వదులుకున్న ఢిల్లీ: 

* ఐపీఎల్ 2026 ముగిసిన కొద్ది రోజులకే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం పెద్ద నిర్ణయం తీసుకుంది. రిషభ్ పంత్‌ను తిరిగి దక్కించుకోవడానికి తమ ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను లక్నో ఫ్రాంచైజీకి ఇచ్చేసింది. అక్షర్ పటేల్ సారథ్యంలో, హేమాంగ్ బదానీ కోచింగ్‌లో ఆడిన ఢిల్లీ, 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది.

బెంగళూరులో ట్రయల్స్.. ముంబై త్రిమూర్తులపై ఫోకస్: 

* టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ గౌరవ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సౌత్, వెస్ట్ జోన్లకు చెందిన యంగ్ ప్లేయర్లను టార్గెట్ చేస్తూ బెంగళూరులో ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్‌లో ముంబైకి చెందిన ముగ్గురు యువ ఆటగాళ్లు ఆయుష్ వర్తక్ (Ayush Vartak), అయాజ్ ఖాన్ (Ayaz Khan), దివ్యాంశ్ సక్సేనా (Divyansh Saxena) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. 

ఎవరీ ఆయుష్, అయాజ్, దివ్యాంశ్?: 

* ఆయుష్ వర్తక్ (బ్యాటింగ్ ఆల్‌రౌండర్): 21 ఏళ్ల ఈ కుర్రాడిని గతేడాది ఆయుష్ మాత్రే, ఖలీల్ అహ్మద్ గాయపడినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ట్రయల్స్‌కు పిలిచింది. అయితే కాంట్రాక్ట్ దక్కలేదు. ఇటీవల ముగిసిన ముంబై టీ20 2026లో నార్త్ ముంబై పాంథర్స్ తరఫున ఆడాడు.

* అయాజ్ ఖాన్ (మిడిల్ ఆర్డర్ హిట్టర్): ముంబై టీ20 లీగ్‌లో కళ్యాణ్ టస్కర్స్‌పై కేవలం కొన్ని బంతుల్లోనే 35 నాటౌట్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

* దివ్యాంశ్ సక్సేనా (మాజీ అండర్-19 స్టార్): ముంబై టీ20 లీగ్‌లో ఆర్క్స్ అంధేరీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ 174 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 261 రన్స్ సాధించాడు.

ఢిల్లీ బలహీనతలు – వేలంలో టార్గెట్స్ ఇవే: 

* కాగితంపై బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ, ఐపీఎల్ 2026లో ఢిల్లీ మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. ఢిల్లీ జట్టు తరఫున కేఎల్ రాహుల్ ఒక్కడే 300 ప్లస్ రన్స్ చేయగా.. అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ లాంటి బిగ్ హిట్టర్లు కీలక సమయాల్లో చేతులెత్తేశారు.

* రాబోయే సవాళ్లు: రిషభ్ పంత్ రాకతో అప్పర్ ఆర్డర్ బలోపేతమైనప్పటికీ, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఫినిషర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా కుల్దీప్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేసే క్వాలిటీ వికెట్ టేకింగ్ స్పిన్నర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి అత్యవసరం.

©️ VIL Media Pvt Ltd.