Reading Time: 2 minutes

జ్యోతిష్యం: రాహువు–కుజుడు గ్రహాల మధ్య నవ పంచమయోగం.. అదృష్టం వరించే నాలుగు రాశులు ఇవే..!

Caption of Image.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాల కమాండర్ అయిన కుజుడు .. రాహువుతో కలవడం వలన ఒక ప్రత్యేకమైన  నవ పంచమయోగం ఏర్పడింది.  ఈ యోగం సెప్టెంబర్​ 18 వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.  రాహువుతో పోలిస్తే కుజుడు ఐదో ఇంట్లో ఉంటాడు. ఈ ప్రభావం వలన  నాలుగు రాశుల(మేషం, మిథునం, తుల, కుంభ ) వారికి  అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆరాశుల గురించి తెలుసుకుందాం. . .! 

 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు.. కుజుడు ఒకే రాశిలో సంచారం సాధారణంగా శుభప్రదంగా పరిగణిస్తారు.  ఈ రెండు గ్రహాలను అశుభ గ్రహాలైనప్పటికి  కుజుడు, రాహువుల ఈ ప్రత్యేక కలయిక వలన నవ పంచమయోగం  ఏర్పడుతుంది. 

మేష రాశి :  కుజుడు.. రాహువు కలవడం వలన ఏర్పడిన నవపంచమ యోగం వలన ఈ రాశివారి జీవితంలో గణనీయమైన మార్పులు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కష్టానికి తగిన ఫలితం ఉంటుంది.  ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. జీవితంలో సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. టెక్నాలజీ …  మేనేజ్‌మెంట్‌కు రంగాలవారు బాగా  విజయం సాధిస్తారు.  ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా అనుకోని విజయాలు లభించే అవకాశం ఉంది.  చేతి వృత్తుల వారికి అనుకోకుండాఆర్డర్లు  లభిస్తాయి.ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు  అనుకూలంగా పరిష్కారం అవుతాయి. 

మిథున రాశి :  కుజుడు– రాహువు మధ్య నవ పంచమయోగం వలన ఈ రాశి వారి జీవితంలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు చాలా మంచి సమయమని పండితులు చెబుతున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.  తక్కువ శ్రమ..ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది.  అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. తమ లక్ష్యాలను సాధించుకోవడానికి, తమ ఆశల్ని నెరవేర్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

తులా రాశి :  నవమపంచమయోగం వలన ఈరాశి వారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి.  వృత్తిపరమైన పురోగతి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ఆర్థిక అవకాశాలు బలపడతాయి. ఊహించని మార్గాల ద్వారా కూడా సంపద కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగరీత్యా విదేశీయానానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలకు, విదేశాల్లో స్థిరపడడానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

►ALSO READ | జ్యోతిష్యం : మిథునరాశిలోకి కుజుడు… ఆరు రాశుల వారు తిరుగులేని విజయం సాధిస్తారు..!

కుంభ రాశి : ఈ రాశిలో  జన్మించిన వారికి కుజ–-రాహువుల కలయిక వలన  ఉత్సాహం పెరుగుతుంది.  మీ ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. మీరు తీసుకొనే వ్యూహాత్మక నిర్ణయాలు  అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కూడా నూరు శాతం సక్సెస్ అవుతాయి. ఆర్థిక సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం చాలా మంచిది. వీరికి అనారోగ్యానికి తగ్గ సరైన చికిత్స లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.