
మన తెలంగాణ/భద్రాచలం : భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం వైభవోపేతంగా జరుగుతోంది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణం తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. భద్రాచలం వీధులు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీత దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజకీయ నాయులు, భక్తులు పాల్గొన్నారు. అంతకు ముందు భద్రాచలం ఆలయ అభివృద్ధికి సిఎం రేవంత్ భూమి పూజ చేయడంతో తొలి విడతలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన కూడా చేశారు.