
అమరావతి: బాలుడిని కిడ్నాప్, హత్య చేసిన కేసులో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై నిందితుడు బీర్ బాటిల్ లో దాడి చేయగా అతడిపై పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోన ఉప్పలపాడు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏడేళ్ల బాలుడిని బావ సర్వేష్ కిడ్నాప్ చేసి హత్య చేశాడు. సర్వేష్ ను పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై నిందితుడు బీర్ బాటిల్ తో దాడి చేశాడు. బీరు బాటిల్ దాడిలో సిఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సర్వేష్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో డబ్బుల కోసం వేమచంద్ర (7) అనే బాలుడిని అక్క మొగుడు సర్వేష్ కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే.