Reading Time: < 1 minute

హైదరాబాద్: హీర్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. పెద్ది మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా ఎఆర్ రహమాన్ సంగీతమందిస్తున్నాడు. పెద్ది అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా? ప్రాణంతో సావుకు ఎదురెళ్లే ఆట అనే డైలాగు బాగుంది. ఇప్పుడు సెప్పు ఉంటావా? పోతావా?.. ఆటే నా పొగరు అనే డైలాగ్ సూపర్‌గా ఉంది. రామ్ చరణ్‌కు తోడు జాన్వీ కపూర్ నటిస్తోంది. పెద్ది చిత్రం ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు సినిమా బృందం ప్రయత్నిస్తోంది.