
దిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీంతో వాహనదారులకు భారీ ఊరట లభించింది. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో పెట్రో ధరలు భారీగా తగ్గనున్నాయి. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 మోడీ ప్రభుత్వం తగ్గించింది. డీజిల్‌పై దీనినిపూర్తిగా ఎత్తివేసింది. గతంలో పెట్రోల్‌పై లీటరు రూ.13 ఎక్సైజ్ సుంకం ఉండగా ఇప్పుడు మూడు రూపాయలు తగ్గించారు. డీజిల్‌పై పది రూపాయలు ఉండగా జీరోకు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్పంగా మార్పులు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరా సంక్షోభం కొనసాగుతున్న సమయంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడంపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.