Reading Time: < 1 minute
Anantapur Crime Accused Shot After Attacking Police During Scene Reconstruction

Anantapur Crime: అనంతపురం జిల్లాలోని కోనుప్పలపాడు గ్రామంలో జరిగిన బాలుడి హత్య కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణలో భాగంగా నేరస్థలాన్ని పునర్నిర్మాణం (సీన్ రీకన్‌స్ట్రక్షన్) చేస్తున్న సమయంలో నిందితుడు సర్వేష్ పోలీసులపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిందితుడిని బాలుడిని హత్య చేసిన ప్రదేశానికి తీసుకెళ్తున్న సమయంలో, అతను అకస్మాత్తుగా అదుపుతప్పి పక్కనే పడివున్న పాత బీర్ బాటిల్‌ను తీసుకుని పోలీసులపై దాడికి దిగాడు. అతన్ని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ, సర్వేష్ తన దాడిని ఆపలేదు.

Read Also: IPL 2026 Full Schedule ఇదే.. 70 మ్యాచ్‌లు, 13 వేదికలు.. ఉప్పల్‌లో 7 మ్యాచుల వివరాలు మీ కోసం..

దీంతో ముందుగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి హెచ్చరించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో, ఆత్మరక్షణలో భాగంగా నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో సర్వేష్ రెండు కాళ్లలో బుల్లెట్ గాయాలతో కుప్పకూలిపోయాడు. ఈ దాడిలో పెద్దవడుగూరు సీఐ బోయ రామసుబ్బయ్యతో పాటు మరో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని సమీపంలోని తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.