Reading Time: < 1 minute

హర్మూజ్ జలసంధి మీదుగా చమురు నౌకల ప్రయాణానికి ఇరాన్ భారీ స్థాయిలో టోల్ రుసుం వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని గల్ఫ్ సహకార మండలి సెక్రెటరీ జనరల్ జెసెమ్ మెహమ్మద్ అల్ బుదాయ్వి తొలిసారిగా తెలిపారు. ఇరాన్ చర్యను తప్పుపట్టారు. ఈ మార్గం గుండా ఒక్కసారి వెళ్లితే మొత్తం చమురులో 20 శాతం వరకూ ఫీజుగా ఇరాన్ దండుకొంటోందని ఆయన విమర్శించారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గల్ఫ్ దేశాల ఈ కూటమిలో సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, యుఎఇ, కువైట్, బహరైన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. సంక్షోభ సమయంలో ఇతరదేశాలను ఈ విధంగా దోచుకుంటున్నారని ఇరాన్‌పై నిప్పులు చెరిగారు.