Reading Time: < 1 minute

ప్రస్తుత గల్ఫ్ యుద్ధం దశలో రష్యా ఇరాన్‌కు పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తోందా? అధునాతన డ్రోన్లు, ఆహార పదార్థాలు అవసరం అయిన డేటా సమకూరుస్తోందా? అవునని , ఇప్పటికే తొలివిడత సాయం ఇరాన్‌కు రష్యా నుంచి అందిందని పాశ్చాత్య ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వాదనను రష్యా అధికారిక కేంద్రం క్రెమ్లిన్ తోసిపుచ్చింది. ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా పోరు దశలో తమ దేశం ఎటువైపు నిలబడటం లేదని రష్యా స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియాలో వెలువడుతున్న కథనాలను తోసిపుచ్చింది. ఈ నెలలో డ్రోన్లు సరఫరా చేయడం ఆరంభం అయింది.ఈ ప్రక్రియ వేర్వేరు దశలలో నెలాఖరులోగా పూర్తి అవుతుందని వెల్లడించారు.ఇజ్రాయెల్ ఇటీవలే రష్యా ఇరాన్ మధ్య సైనిక ఆయుధ రవాణా మార్గాన్ని గుర్తించింది.

ఈ క్రమంలోనే కాస్పియన్ సముద్రంలోని ఈ మార్గాన్ని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి రహస్యంగా ఇరాన్‌కు బారీ స్థాయిలోనే ఆయుధ సాయం అందుతున్నట్లు పసికట్టారు. చిరకాలంగా రష్యాకు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను, ఖమేనీని అంతమొందించడాన్ని రష్యా బహిరంగంగా ఖండించింది. లక్షాలను ఛేదించేందుకు అవసరం అయిన డేటా, శాటిలైట్ల ఛాయాచిత్రాలను ఎప్పటికప్పుడు ఇరాన్‌కు రష్యా మిత్రపక్షంగా చేరవేస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ జంటదాడులతో తల్లడిల్లుతున్న దశలో వెంటనే స్పందించడమే మిత్రధర్మమని రష్యా భావించింది. ఈ దిశలోనే సాయానికి దిగిందని వార్తలు వచ్చాయి. అయితే అటువంటిదేమీలేదని క్రెమ్లిన్ తెలిపింది.