Reading Time: < 1 minute

మలయాళ నాటక, సినీ రంగంలో ప్రముఖ నటుడు, దర్శకుడు ఇ.ఏ. రాజేంద్రన్ (71) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఆయన వైద్య చికిత్స పొందుతున్నారు. ఆయన స్వస్థలం త్రిస్సూర్ జిల్లా లోని త్రిత్తల్లూర్ వద్ద శుక్రవారం అంత్యక్రియలు జరుగుతాయి. 1981లో సినీ రంగ ప్రవేశం చేసిన రాజేంద్రన్ సుమారు 60 కి పైగా మళయాళ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రముఖ నటుడు , ఎమ్‌ఎల్‌ఎ ముఖేష్‌కు స్వయానా బావ అయిన రాజేంద్రన్ నరసింహం, మీశమాధవన్, కలియాట్టం వంటి సూపర్‌హెట్ సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రలు పోషించారు. రాజేంద్రన్ భార్య సంధ్య, కుమారుడు  దివ్యదర్శన్ కూడా చిత్ర పరిశ్రమలో నటులుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర హార్టికల్చర్ కార్పొరేషన్‌లో కూడా ఆయన పనిచేశారు. ఆయన మృతికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు.