
సబితా ఇంద్రా రెడ్డి కాంగ్రెస్‌లో ఎంఎల్‌ఎగా గెలిచి, బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారని మంత్రి సీతక్క అన్నారు. తాను టిడిపిలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో లేదు అని, కాంగ్రెస్‌లో చేరినప్పుడు కూడా ఆ పార్టీ అధికారంలో లేదని చెప్పారు. బిఆర్‌ఎస్ హయాంలో అన్ని చేశాం..అన్నీ బాగున్నాయి అంటున్నారు, ఇపుడు ఒక్క రోడ్డు లేదు, వాటర్ ట్యాంక్ లేదు అంటున్నారు…ఇది ఎలా సాధ్యం..? అని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డికి తనపై ద్వేషం ఉండొచ్చు..కానీ తనకు ఎందుకు ఉంటుందని అని ప్రశ్నించారు. “ఆమె కేటగిరీ వేరు,నా కేటగిరీ వేరు, ఆమె రాజ్యం వేరు, నా రాజ్యం వేరు…వాళ్ళది హైదరాబాద్ సిటీ…మేము అడవి బిడ్డలం.. మాకు ఎక్కడ కూడా వాళ్లతో పోలిక లేదు” అని పేర్కొన్నారు. తమకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదు అని, వాళ్లు అన్న మాటలు ఒక్కసారి పరిశీలించుకోవాలని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డిలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.