Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌.. రెండో ఫేజ్ షెడ్యూల్‌ని బిసిసిఐ విడుదల చేసింది. ఈ దశలో మొత్తం 50 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు దేశంలోని 12 వేదికల్లో ఈ మ్యాచ్‌‌లు జరుగుతాయి. కొద్ది రోజుల కిందటే తొలి ఫేజ్ షెడ్యూల్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 28 నుంచి ఐపిఎల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. తొలి దశలో 20 మ్యాచ్‌లు, రెండో దశలో 50 మ్యాచ్‌లు జరుగతాయి. మొత్తం కలిపి 70 మ్యాచులు జరుగుతాయి. ప్లేఆఫ్స్ వేదికలను తర్వాత ప్రకటించనున్నారు.

రెండో దశలో బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఏప్రిల్ 13న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. రెండో దశలో 8 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి.