Reading Time: < 1 minute

హైదరాబాద్: శుక్రవారం జరిగే శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. సీతారాంబాగ్ దేవాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్రం జరగనుంది. ఈ మార్గంలో వాహనాలకు అనుమతి లేదు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్ నుంచి మారేడుపల్లి ఎక్స్ రోడ్స్‌ వైపు ట్రాఫిక్ మళ్లించనున్నారు. మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పూరానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడీ జక్షన్ వైపు డైవర్ట్ చేయనున్నారు. ఎంజె బ్రిడ్జ్, బేగం బజార్, అఫ్జల్‌గంజ్, సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలను జుమేరాత్ బజార్ మీదుగా మళ్లించనున్నారు. అబిడ్స్ జిపిఒ, సుల్తాన్ బజార్, కోఠి, అబిడ్స్ ప్రధఆన రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఎంజె మార్కెట్, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొనేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు.