
అమరావతి: అమరావతిలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అవినీతి యజ్ఞం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అమరావతి పేరుతో రైతుల సమస్యల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామా అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందుకే 2019 లో అధికారంలోకి రాకముందే మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని తెలియజేశారు. అమరావతి కోసం తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. అసెంబ్లీతో పాటు, మండలిని కూడా సమావేశపరచాలని కదా? అని అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న దోపిడీపైనే వైసిపి అభ్యంతరం చెప్పింది అని అన్నారు. ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ఎత్తుగడ అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.