
తిరుపతి: క్షణికావేశంలో ఓ కసాయి తల్లి మాతృత్వానికే కలంకం తెచ్చే పని చేసింది. పాల కోసం ఏడుస్తున్న కూతుర్నే గొంతు నులిమి చంపేసింది. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని నరసరాజు అగ్రహారంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని వెంగలచేరికి చెందిన హైమవతి, వెంకటేశ్ దంపతులు సత్యవేడు పరిసరాల్లోని ఓ సిమెంట్ ఇటుకల తయారీ పనులకు వెళ్తు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు రుత్విక్, ఆరు నెలల చిన్నారి ఉన్నారు. గురువారం చిన్నారి పాల కోసం ఏడుస్తుందని క్షణికావేశంలో తల్లి పసిపాప గొంతు నులిమేసింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిఐ మురళి, ఎస్సై సాయినాథ్ ఘటనస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.