Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రోఫీని సొంతం చేసుకొనేందుకు ప్రతీ జట్టు వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ సారి ట్రోఫీని గెలుచుకోవడమే తమ లక్ష్యమని లక్నో సూపర్‌జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) యజమాని సంజీవ్ గోయెంకా అన్నారు. ‘‘మా నిజమైన గుర్తింపు ఇంకా రూపుదిద్దుకుంటోందని నేను భావిస్తున్నా. ఏ క్రీడా జట్టుకైనా ట్రోఫీ గెలిస్తేనే గౌరవం. మేము ఇప్పటి వరకూ రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాం. కచ్చితంగా అది సరిపోదు. కొన్నిసార్లు గెలుస్తాం. మరికొన్నిసార్లు ఓడిపోతాం. కానీ మేం మా మొదటి ట్రోఫీని గెలవాలి’’ అని సంజీవ్ పేర్కొన్నారు.