
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అందించిన ఆహారంలో పురుగులు కన్పించడం తీవ్ర వివాదాస్పదమైంది. మార్చి 15న పట్నా-టాటా నగర్ వందేభారత్ ఎక్స్‌ప్రేస్‌లో రితేష్‌కుమార్ అనే వ్యక్తి ప్రయాణించారు. ఆ సమయలో తమకు అందించిన భోజనంలోని పెరుగులో పురుగులు రావడంతో ఆయన కంగుతిన్నారు. వెంటనే మేనేజర్‌ను పిలిచి ఫిర్యాదు చేశారు. రైలు సిబ్బంది ఆ భోజనాన్ని పరిశీలించారు. ఇదంతా రితేష్ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో స్పందించింది. ఐఆర్‌సిటిసికి రూ.10 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. ఆ రైల్లో కేటరింగ్ చేసిన ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్‌కు రూ.50 లక్షల జరిమానా విధించడంతో పాటు అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేసింద. ప్రయాణికుల భద్రత, రైల్యే సౌకర్యాల్లో నాణ్యతే తమ ప్రథమ ప్రాధాన్యమని రైల్వేశాఖ వెల్లడించింది.