
అమెరికా-ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ అలిరెజా తంగ్సిరీ మృతి చెందినట్లు తెలుస్తోంది. తమ దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ తెలిపింది.
ఇరాన్ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నౌకాదళ విభాగానికి నాయకత్వం వహించిన తంగ్సిరి, ఓడరేవు పట్టణమైన బందర్ అబ్బాస్‌లో జరిగిన దాడిలో మరణించినట్లు సమాచారం. హోర్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని పర్యవేక్షించే బాధ్యత కమోడోర్ తంగ్సిరి నిర్వహిస్తున్నాడని ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. అయితే, ఈ దాడి గురించి ఇరాన్ నుండి ఎలాంటి స్పందన రాలేదు.