Reading Time: < 1 minute

ఐపిఎల్ 2026 సీజన్ తర్వాత స్వదేశంలో టీమిండియా ఆడబోయే మ్యాచ్ ల షెడ్యూల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఈ సీజన్‌లో భారత్, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. వెస్టిండీస్‌తో మూడు వన్డేలు(ODI), ఐదు T20I మ్యాచ్‌ల సిరీస్..  శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు T20I మ్యాచ్‌ల సిరీస్.. చివరగా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.

ఈ దేశీయ సీజన్ లో మొదట ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత ఇరుజట్ల మూడు వన్డేల సిరీస్ ఉంటుంది. ఈ ఏడాది చివర్లో సెప్టెంబర్ 27 నుండి వెస్టిండీస్ జట్టుతో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడనుంది. అనంతరం ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ అక్టోబర్ 6న ప్రారంభం కానుంది. ఇక, డిసెంబర్ నెలలో శ్రీలంక, భారత పర్యటనకు రానుంది. డిసెంబర్ 13న న్యూఢిల్లీలో జరిగే మొదటి మ్యాచ్ తో వన్డే సిరీస్ మొదలవుతుంది. డిసెంబర్ 22న T20I సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 3 నుండి 9 వరకు, భారత్ జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.

ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ జనవరి 21న ప్రారంభమవుతుంది. మొదటి టెస్టు మ్యాచ్‌కు నాగ్‌పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. మిగిలిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు చెన్నై, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్ లో జరుగుతాయి. ఈ టెస్టు సిరీస్ మార్చి 3 వరకు కొనసాగుతుంది.