
ఓ మహిళ తన మూడేళ్ల బిడ్డతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎలవేని రేఖ(25) అనే మహిళ, తన కుమారుడు (3)తోపాటు.. తల్లిగారి ఇంటి వద్ద ఉన్న వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనలో తల్లి, కొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను బావి నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. కుటుంబ సమస్యల కారణంగానే రేఖ ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.