
హైదరాబాద్: స్టార్ హీరో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో ఆయనకు గాయమైన విషయం తెలిసిందే. అయితే సకాలంలో సరైన వైద్యం అందడంతో చరణ్ త్వరగా కోలుకున్నారు. ఈ సందర్భంగా చరణ్‌కు వైద్యం అందించిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. చరణ్‌కి సర్జరీ చేసిన వైద్యుడికి చిరు సోషల్‌మీడియా వేదికగా కృతజ్ఙతలు తెలిపారు
‘‘చరణ్ కనురెప్పకు మీరు సరైన సమయంలో ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేసినందుకు ధన్యవాదాలు. మొదట మాకు కొంత ఆందోళన కలిగింది. కానీ, మీ మాటలు విన్నాక భయం పోయి ధైర్యం వచ్చింది’’ అని డాక్టర్ సుధాకర్‌ని ఉద్ధేశిస్తూ చిరంజీవి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై చిరు అభిమానులతో పాటు చరణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చరణ్ త్వరగా కోలుకోవాలని వాళ్లు ఆశిస్తున్నారు.