
మార్కాపురం జిల్లా రోడ్డు ప్రమాదం ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ, రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి.. బస్సు ప్రమాదంపై ఎపి అధికారులతో మాట్లాడాలని సీఎస్‌ను ఆదేశించారు. కాగా, ఈ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది.