
అమరావతి, మార్చి 26: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సెకండ్ ఇయర్ కొత్త సిలబస్ లీక్ వ్యవహారంలో కేసు నమోదైంది. తెలుగు సంస్కృత అకాడమీ డిప్యూట్ డైరక్టర్ కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే..
2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌లో ప్రభుత్వం కొత్త సిలబస్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తెలుగు అకాడమీ, ఇంటర్ బోర్డు నుంచి సిలబస్ విడుదల చేయకముందే సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులో న్యూ సిలబస్ పీడీఎఫ్ క్లిప్పింగ్స్ ప్రత్యక్షమయ్యాయి. కొత్తగా ప్రవేశపెడుతున్న సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ సిలబస్ లీక్ అవడంపై VGS పబ్లిషర్స్ కు తెలుగు అకాడమీ నోటీసులు ఇచ్చింది. కొత్త సిలబస్ బుక్స్ ప్రింటింగ్ కు ముందే కెమిస్ట్రీ, పీజిక్స్ సిలబస్ పీడీఎఫ్‌లు లీకయినట్లు గుర్తించింది. దీంతో తెలుగు, సంస్కృత అకాడమీ డిప్యూటి డైరక్టర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.