
ప్రియుడి మోజులో పడి కన్నతల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిందో కూతురు. పది నెలల క్రితం జరిగిన ఈ ఘటన నగర శివారు ప్రాంతమైన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్‌నగర్‌లో చోటు చేసుకుంది. తన ప్రేమకు అడ్డు వస్తుందన్న కారణంతో తల్లి అంజు డిఆర్(40)ని ప్రియుడితో కలిసి చంపింది.ఆపై శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. కాగా తల్లి కనిపించక పోవడంతో మృతురాలు పెద్ద కూతురు డి.రోషిని కుమారి 2025 అక్టోబర్ 17న జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివిధ కోణాల్లో విచారించిన పోలీసులు మృతురాలి చిన్న కూతురు(17),ఆమె ప్రియుడును తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. దీంతో ఆమెతో పాటు ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్‌నగర్‌లో అంజు(45)తన మైనర్ కూతురుతో కలిసి నివాసముంటోంది.
అంజు తన మైనర్ కూతురు ఇషికాకు మౌంటికుమార్ సింగ్ అలియాస్ మోంటి రాజ్(22)లు ప్రేమించుకుంటున్నారు. గత కొంత కాలంగా వారు సహజీవనం చేస్తున్నారు. ఈ విషయంలో తల్లి అంజు తన కూతురు మైనర్ కావడం, కుల విభేదాల కారణంగా వారి ప్రేమ వ్యవహరాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అక్టోబర్ 2024లో మైనర్ బాలికతో ఇంట్లో పట్టుబడగా తల్లి అంజు జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేయగా 50 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. విడుదలైన తర్వాత కూడా వారు సంబంధాన్ని కొనసాగించగా మరోసారి జనవరి 2025లో పోక్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. దీంతో తల్లిపై కక్షగట్టిన కూతురు తల్లిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఎవరికి అనుమానం రాకుండా పక్కా ప్రణాళికతో ప్రియుడితో కలిసి తల్లిని చంపి ఇంట్లోనే గోతిని తవ్వి పూడ్చిపెట్టింది. ఇటివల గర్బవతి కావడంతో ఆమెను మౌంటిరాజ్ యాదగిరిగుట్టలో వివాహం చేసుకోని కలిసి జీవిస్తున్నారు.
తల్లి కనిపించడం లేదని ఫిర్యాదు అందుకున్నపోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తుండగా ఇటివల మృతురాలి టూ వీలర్‌ను మౌంటికుమార్ విక్రయించడంతో కొనుగోలు చేసిన వ్యక్తి తన పేరుపై వాహనాన్ని మార్చుకొనే క్రమంలో ఈ విషయం బయట పడింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మర్డర్ వ్యవహారం బయట పడింది.హత్యకు ఇషికాకు ఆమె ప్రియుడు కూడా సహాకరించినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో పోలీసులు,క్లూస్ టీం సహాయంతో తవ్వకాలు చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలికను జువైనల్ హోమ్‌కు తరలించి ఆమె భర్త మౌంటీరాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.