
భారత స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. దినేష్ కార్తిక్‌పై తమ అభిమానాన్ని చెన్నైస్ అమృత విద్యాసంస్థల విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అమృత విద్యా సంస్థల వార్షిక క్రీడోత్సవంలో భాగంగా కార్తిక్ జెర్సీ నంబర్ ‘19’ ఆకారంలో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి అమృత విద్యా సంస్థలకు చెందిన దాదాపు మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
వీరంత కలిసి సిఎడికె19 అనే ఆకారంలో మానవహారాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఒక క్రీడాకారుడి జెర్సీని ప్రతిబింబించే మానవహారంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడంతో దీనికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు లభించింది. అమృత గ్రూప్ చైర్మన్ భూమినాథన్, డాక్టర్ ఎంజిఆర్ మెడికల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.నారాయణ స్వామి, స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.