Reading Time: < 1 minute

న్యూజిలాండ్‌తో బుధవారం జిరగిన ఐదో, చివరి టి20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీ టీమ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 32తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కానర్ విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న కానర్ 33 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లు, ఐదు ఫోర్లతో 75 పరుగులుచేశాడు. రుబిన్ హర్మాన్ (39), వియాన్ ముల్డర్ (31), డియాన్ ఫారెస్టర్ 21 (నాటౌట్) తమవంతు సహకారం అందించడంతో సఫారీ టీమ్ ప్రత్యర్థి ముందు మెరుగైన లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. బెవన్ జాకబ్స్ (36) ఒక్కడే కాస్త పోరాడాడు.