Reading Time: < 1 minute

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రాకాస’. హారర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమాను మాసన శర్మ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఓవైపు కామెడీతో నవ్వులు పూయిస్తూనే.. మరోవైపు హారర్‌తో భయపెడుతోంది ఈ సినిమా ట్రైలర్. ఇక ఈ సినిమాలో గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనుదీప్ దేవ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని మీరు చూసేయండి…