Reading Time: < 1 minute

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి ఆనందమైన క్షణాలను ఎంజాయ్ చేసేందుకు వెకేషన్ కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన స్పెషల్ మీడియోను రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానుతో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఫిబ్రవరి 26, గురువారం రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లికి ముందు జరిగిన వేడుకలు కూడా ఎంతో వైభవంగా జరిగాయి. ఫిబ్రవరి 25, బుధవారం జరిగిన హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు సందడి చేశారు. హల్దీ ఫోటోలను కూడా రష్మిక ఇటీవల షేర్ చేసింది.