
MS Dhoni: ఐపీఎల్ 2026 ప్రారంభానికి మరో మూడు రోజులే సమయం ఉండటంతో క్రికెట్ సందడి ఆకాశాన్న అంటుతోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో ధోనీ ఫిట్‌నెస్, సంజూ శాంసన్ రాకపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీఎస్కే తమ తొలొ మ్యాచ్ ని గువహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ప్రస్తుతం ఈ చెన్నై ప్రాక్టీస్ సెషన్లలో మునిగిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఎంఎస్ ధోనీ ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదడం కనిపిస్తోంది. ఇది చూసి వింటేజ్ ధోనీ ఫామ్‌లోనే ఉన్నాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
2023లో ఐదోసారి సీఎస్‌కేకు టైటిల్ అందించిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ మోకాలికి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ సమస్య అతడిని ఇంకా వేధిస్తూనే ఉంది. ఈ సీజన్‌లో ధోనీ ఎన్ని మ్యాచ్‌లు ఆడతారనే దానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నప్పటికీ, నెట్స్‌లో అతడి బ్యాటింగ్ చూస్తుంటే అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కాగా రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను వదులుకుని ట్రేడింగ్ ద్వారా సంజూ శాంసన్‌ను సీఎస్‌కే తమ జట్టులోకి తెచ్చుకుంది.
►ALSO READ | Rajasthan Royals: రియాన్ పరాగ్కి రాజస్థాన్ రాయల్స్ బిగ్ షాక్.. కొత్త కెప్టెన్గా అతడే!
ఒకవేళ ఎంఎస్ ధోనీ ఫిట్‌నెస్ కారణంగా వికెట్ కీపింగ్ చేయలేకపోతే, సంజూ శాంసన్ ప్రత్యామ్నాయంగా ఉన్నాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ టైటిల్ గెలవడంలో సంజూ కీలక పాత్ర పోషించారు. క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్‌పై 97 నాటౌట్, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 89, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 89 పరుగులు చేసి భీకరమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. మరోవైపు, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్‌కే లీడర్‌షిప్ గ్రూప్‌లో సంజూ అనుభవం జట్టుకు అదనపు బలాన్ని ఇవ్వనుంది.
సీఎస్‌కే మ్యాచులు:
* మార్చి 30: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (గౌహతి)
* ఏప్రిల్ 3: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (చెన్నై)
* ఏప్రిల్ 5: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్‌సీబీ (బెంగళూరు)
* ఏప్రిల్ 11: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (చెన్నై)
Here is the glimpse of MS Dhoni batting in the intra-squad match yesterday at Chepauk ✅💛
He smashed a six off Mukesh choudhary’s bowling 🔥🔥
Thala looking in good touch ahead of the tournament 😮💨💛 pic.twitter.com/ghJ8UmyY8c
— DB’ (@Brevisnation7) March 24, 2026