
విజయవాడ టెర్రర్ లింక్ లో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యాయి. బుధవారం హైదరాబాద్ కు చెందిన సైదాబేగం, బెంగళూరకు చెందిన అబ్దుల్ ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరిని కోర్టులో హాజరుపర్చారు. ఏడాది క్రితం భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న సైదా బేగం.. 42 మందితో టెర్రర్ గ్రూపును ఏర్పాటు చేసింది. రాత్రి సమయాల్లో సోషల్ మీడియాలో టెర్రర్ పోస్టింగ్ లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టెర్రర్ పోస్టింగ్ ల కోసవ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకొని ప్రచారం చేస్తోంది. యువతను టెర్రర్ వైపు మళ్లిస్తుందని పోలీసులు తెలిపారు.
కాగా.. నిన్న విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్‌ఐఎస్, ఆఖిస్ (ఎక్యూఐఎస్)లతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని మహమ్మ ద్ రహమతుల్లా షరీఫ్, ఎండి. డానిష్, మీర్జా సో హైల్ బేగ్‌లుగా గుర్తించారు.