
తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రానున్న రెండు మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక, హైదరాబాద్, మేడ్చల్, మంచిర్యాల, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడింది.