Reading Time: < 1 minute

ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడికి 5 రోజులు బ్రేక్ : రెగ్యులర్ యుద్ధం కొనసాగుతుంది..!

Caption of Image.

ఇరాన్ యుద్ధంలో కీలక మలుపు. హర్మూజ్ జల సంధిని ఓపెన్ చేయకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కొద్దిగా వెనక్కి తగ్గారు. యుద్ధం కొనసాగుతుందని ప్రకటిస్తూనే.. పవర్ ప్లాంట్లపై దాడికి మాత్రం 5 రోజులు బ్రేక్ ఇచ్చారు. ఇరాన్ దేశం నుంచి ఆశించిన స్థాయిలో సంకేతాలు వచ్చాయి.. చర్చలు బాగా జరిగాయి.. అందుకే ఐదు రోజుల్లో ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ కీలక ప్రకటన చేశారు. హార్ముజ్​ జలసంధి తెరవాలని లేకపోతే  ఇరాన్​ పవర్​ ప్లాంట్లపై దాడి చేస్తామని  48 గంటల గడువిచ్చిన ట్రంప్​.. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇరాన్​ పవర్​ ప్లాంట్లపై దాడికి 5 రోజుల బ్రేక్​ ఇచ్చారు. ఇరాన్​ తో జరిపిన చర్చలతర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇరాన్​ తో జరిపిన చర్చల్లో యుద్దానికి సానుకూల పరిష్కార మార్గాలు లభించాయి. రెండు దేశాల మధ్య అత్యంత సానుకూల చర్చలు జరిగాయని తెలియజేసేందుకు నేను సంతోషిస్తున్నాను..ఈ వారం జరిగిన నిర్మాణాత్మక చర్చలను అనుసరించి ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు,చర్చల విజయవంతంతో ఇరాన్ పవర్ ప్లాంట్లు ,ఇంధన మౌలిక సదుపాయాలపై జరగాల్సిన అన్ని సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని  సైనిక బలగాలను (Department of War) ఆదేశించాను.  అంటూ ట్రంప్​ తన ట్రూత్​ సోషల్ రాశారు. 

రు. 

©️ VIL Media Pvt Ltd.