Reading Time: < 1 minute
Social Boycott Sparks Tension In Srikakulam Village Over Land Dispute

Social Boycott: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాం గ్రామంలో సామాజిక బహిష్కరణ అంశం కలకలం రేపింది. ఓ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేస్తున్నట్లు గ్రామ పెద్దలు , ప్రజలు కలసి తీర్మానం చేశారు. భూ వివాదం నేపథ్యంలో కుటుంబానికి సామాజిక బహిష్కరణ చేస్తూ గ్రామస్థులు తీర్మానం చేయడమే కాకుండా, కొండములగాం గ్రామంలో ఎలాంటి పనులకు పిలవకూడదు, ఎటువంటి శుభకార్యక్రమాలకు పిలవవద్దని దండోరా వేయించారు. సదరు కుటుంబం భూమి రికార్డ్ రెవెన్యూలో తారుమారు చేయటం, ఎన్నిసార్లు గ్రామ పెద్దలు చెప్పిన పెడచెవిన పెట్టడంతో గ్రామసభ ఈ తీర్మానం చేసింది. అయితే, సామాజిక బహిష్కరణ నేరమని, గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలింగించకుండా చర్యలు తీసుకుంటా మంటున్న పోలీస్, రెవెన్యూ అధికారులు తెలిపారు.

Read Also: CSK Hall of Fame: సీఎస్ కే హిస్టరీలో మైలురాయి.. ఫస్ట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సురేష్ రైనా, మాథ్యూ హేడెన్ ఎంట్రీ