Reading Time: < 1 minute

కరన్ ప్లేస్ లో రాయల్స్ జట్టులోకి షనక!

Caption of Image.

న్యూఢిల్లీ: శ్రీలంక టీ20 టీమ్ కెప్టెన్ దసున్ షనక ఐపీఎల్‌‌ 19వ సీజన్‌‌ ఆరంభానికి ముందు రాజస్తాన్ రాయల్స్ జట్టులో చేరనున్నాడు. గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌‌రౌండర్ సామ్ కరన్ స్థానంలో షనకను రాయల్స్‌ తమ జట్టులోకి తీసుకోనుంది.

 ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌‌ఎల్‌‌)లో లాహోర్ ఖలందర్స్ తరఫున ఆడుతున్న షనక త్వరలోనే గువాహటిలో రాయల్స్ జట్టుతో కలవనున్నాడు. ఇప్పటికే జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ  కేకేఆర్ కోసం పీఎస్‌‌ఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకోగా, ఇప్పుడు షనక కూడా అదే బాట పట్టడం ఆ లీగ్‌‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. 

షనకకు సంబంధించిన పేపర్‌‌వర్క్ ప్రస్తుతం తుది దశలో ఉందని, అది పూర్తి కాగానే అతను ఇండియాకు చేరుకుంటాడని రాయల్స్ టీమ్ వర్గాలు తెలిపాయి. 

©️ VIL Media Pvt Ltd.