Reading Time: < 1 minute

వాషింగ్టన్: హర్మూజ్ ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎలాంటి బెదిరింపులు లేకుండా హర్మూజ్ జలసంధిని తెరవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హర్మూజ్ జలసంధిని ఇరాన్ 48 గంటల్లో తెరవాలని, ఇరాన్ లోని వివిధ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ లోని పెద్ద విద్యుత్ కేంద్రంతోనే దాడిని ప్రారంభిస్తామని ట్రంప్ తెలియజేశారు.