Reading Time: 2 minutes

Nani Nithiin Movie: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో.. నితిన్తో నాని మూవీ.. ఇంట్రెస్టింగ్గా టైటిల్ గ్లింప్స్‌

Caption of Image.

టాలీవుడ్‌లో మోస్ట్ ఎగైటింగ్ కాంబినేషన్ సెట్ అయింది. నేచురల్ స్టార్ నాని తన నిర్మాణ సంస్థ ‘యూనానిమస్ ప్రొడక్షన్స్’ (uNANImous Productions) బ్యానర్‌పై తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. హీరో నితిన్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘అలియాస్ రుక్మిణీ’ (Alias Rukmini) అనే క్రేజీ టైటిల్ అనౌన్స్ చేసి ఆసక్తి పెంచారు.

తాజాగా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్‌ మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా నాని అందించిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్లింప్స్‌లో చూపించిన డిఫరెంట్ కాన్సెప్ట్, ఇంటెన్స్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాని ’దండోరా’ మూవీతో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్ తెరకెక్కిస్తుండటంతో పిచ్చ క్యూరియాసిటీ పెరిగిపోయింది. మరి ముఖ్యంగా ఈ సినిమాలో నితిన్కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు సమాచారం.

నితిన్ రుక్మిణి వసంత్ కాంబో:

‘టాక్సిక్’, ‘డ్రాగన్’ చిత్రాలతో బిజీగా ఉన్న బ్యూటీ రుక్మిణీ వసంత్‌.. ఇప్పుడు నితిన్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.  ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రం కోసం రుక్మిణి పేరును పరిశీలించగా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే టైటిల్ & కథ కూడా రుక్మిణి పేరుకు లింక్ అవ్వడంతో ఆల్మోస్ట్ ఈ బ్యూటీ ఫిక్స్ అయినట్లు టాక్. 

నాని రేంజ్ డిఫరెంట్: రుక్మిణి

గతంలో రుక్మిణి ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్లో తనకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పేసింది. తెలుగులో మీకు ఏ హీరో అంటే  ఇష్టం? “ఎవరితో కలిసి నటించాలనుందని అడగానే, తనకు నేచురల్ స్టార్ నానితో (Nani)కలిసి పని చేయాలని ఉన్నట్లు తెలిపింది.

ALSO READ : దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ ఫారిన్  షెడ్యూల్ కంప్లీట్

నాని రేంజ్ డిఫరెంట్ అని, అతను చేసే సినిమాల్లో ఒక అర్ధముంటోంది. అంటే సుందరానికీ, శ్యామ్ సింగరాయ్ లాగా ప్రతీ సినిమా కొత్తగా ఉండటంతో పాటూ ఆయన సినిమాల్లో హ్యూమర్ ఉంటుందని చెప్పింది. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ నుంచి వచ్చే సినిమా కోసం తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో మాత్రం నితిన్ తో జతకట్టడం విశేషం. ఫ్యూచర్ లో నానితో కూడా సినిమా చేసే ఛాన్స్ లేకపోలేదు.

©️ VIL Media Pvt Ltd.