Reading Time: < 1 minute

కేటో మోటార్స్ కమర్షియల్ ఈ- బస్ లాంచ్..

Caption of Image.
  • ఆవిష్కరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: దేశీయ సంస్థ కేటో మోటార్స్ రూపొందించిన తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్‌‌‌‌ను ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంచ్ చేశారు. హైదరాబాద్‌‌‌‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 9 మీటర్ల పొడవైన ఈ ఈ-బస్‌‌‌‌ను ఆపరేటింగ్ పార్టనర్‌‌‌‌కు అందించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ప్రపంచంతో పోటీపడుతోందని కొనియాడారు.

ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది కేవలం పెట్రోల్, డీజిల్‌‌‌‌కు ప్రత్యామ్నాయం మాత్రమే కాదని, అది దేశ ఇంధన భద్రతకు, కాలుష్య నియంత్ర ణకు కీలకమన్నారు. ఒకప్పుడు వ్యాక్సిన్ల కోసం విదేశాల వైపు చూసే మనం.. నేడు ఆటోమొబైల్ రంగంలోనూ ఆత్మనిర్భరత సాధించామని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరం ఐటీ, ఫార్మాతో పాటు ఎలక్ట్రిక్ మొబిలిటీ, సెమీకండక్టర్ డిజైన్ హబ్‌‌‌‌గా మారుతోందని తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.